ఎన్నికల్లో విజయంపై శ్రీ లారెన్స్ వాంగ్‌కు భారత ప్రధాని అభినందనలు

ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ లారెన్స్ వాంగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ – సింగపూర్ మధ్య సన్నిహిత ప్రజా సంబంధాల ద్వారా బలమైన, బహుముఖీనమైన భాగస్వామ్యం నెలకొని ఉన్నదని ఆయన పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

‘‘సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన @LawrenceWongST కు హృదయపూర్వక అభినందనలు. సన్నిహిత ప్రజా సంబంధాల ఆధారంగా భారత్, సింగపూర్ మధ్య బలమైన, బహుముఖీనమైన భాగస్వామ్యం ఉంది. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మీతో కలిసి పనిచేయడం కోసం నేను ఎదురుచూస్తున్నాను.”

***

MJPS/SR/SKS

(రిలీజ్ ఐడి: 2126824) 

ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: