Union Home Minister asks Delhi Government, all three Mayors and MCsD to work together

Union Home Minister Shri Amit Shah has said we have to make the country and the national capital Corona free, healthy and prosperous at the earliest under the leadership of the Prime Minister Shri Narendra Modi. Shri Amit Shah chaired a meeting here today with the Union Health Minister Dr. Harsh Vardhan, Delhi LG Shri Anil Baijal, CM Shri Arvind Kejriwal, Mayors of three Municipal Corporations of Delhi and senior officers to review COVID-19 situation in the national capital.

The Union Home Minister directed the Central Government, Delhi Government and all three Municipal Corporations of Delhi to ensure proper implementation of the decisions taken in the meeting held earlier this morning such as house-to-house survey, Corona testing etc to the lowest level. The Home Minister said the main aim of this meeting is to win the fight against Corona with mutual coordination.

Shri Amit Shah said we have to turn the country and the national capital Corona free, healthy and prosperous at the earliest under the leadership of the Prime Minister Shri Narendra Modi. He said this will be possible with the cooperation and coordination of all concerned. Union Home Minister asked the Delhi Government, all three Mayors and three the Municipal Corporations of Delhi to work together and implement the decisions taken in this morning’s meeting. The Home Minister also directed the Delhi Police Commissioner to ensure all guidelines are enforced strictly.

NW/RK/PK/AD/DD

Telugu

ఢిల్లీలో కోవిడ్ -19 ప‌రిస్థితిపై నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్య‌క్ష‌త వ‌హించారు.

దేశాన్ని, దేశ రాజ‌ధానిని క‌రోనా ర‌హితం చేయాల‌ని, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో వీలైనంత త్వ‌ర‌గా ఆరోగ్యం , సుసంప‌న్న‌త సాధించాల‌ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు.కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ అనిల్ బైజ‌ల్, ముఖ్య‌మంత్రి శ్రీ అర‌వింద్ కేజ్రివాల్‌, ఢిల్లీకి చెందిన మూడు మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల మేయ‌ర్లు, ఇత‌ర సీనియ‌ర్ అధికారుల‌తో  దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో కోవిడ్ -19 ప‌రిస్థితులపై నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా  అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ ఉద‌యం జ‌రిగిన స‌మావేశంలో తీసుకున్న ఇంటింటి స‌ర్వే , అట్ట‌డుగు స్థాయి వ‌ర‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వంటి  నిర్ణ‌యాల‌ను స‌క్ర‌మంగా అమ‌ల‌య్యేట్టు చూడాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని, ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని, ఢిల్లీలోని మూడు మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల‌ను ఆయ‌న ఆదేశించారు. ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో క‌రోనా పై పోరాటంలో విజ‌యం సాధించ‌డ‌మే ఈ స‌మావేశం ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ నాయ‌కత్వంలో మ‌నం దేశాన్ని, దేశ రాజ‌ధానిని క‌రోనా ర‌హితం చేసి ఆరోగ్యం, సుసంప‌న్న‌త ను వీలైనంత త్వ‌ర‌గా సాధించాల‌ని శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు. దీనిని అంద‌రి ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం, స‌మ‌న్వ‌యంతో తోనే సాధించ‌గ‌ల‌మ‌ని ఆయ‌న అన్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వం, ఢిల్లీకి చెందిన ముగ్గురు మేయ‌ర్లు, ఢిల్లీలోని మూడు మునిసిప‌ల్ కార్పొరేష‌న్లు క‌లిసి పనిచేస్తూ, ఉద‌యం జ‌రిగిన స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను అమ‌లు చేయాల‌ని కోరారు. అన్ని మార్గ‌ద‌ర్శ‌కాలూ క‌చ్చితంగా అమ‌ల‌య్యేలా చూడాల్సిందిగా ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్‌ను కేంద్ర హోంమంత్రి ఆదేశించారు.